హీరో నాని మూవీలో లస్ట్ స్టోరీస్-2 యాక్టర్

by Javid Pasha |
హీరో నాని మూవీలో లస్ట్ స్టోరీస్-2 యాక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న మూవీలో లస్ట్ స్టోరీస్-2 యాక్టర్ అంగద్ బేడీ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు #నాని30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను రేపు (జులై 13) ప్రకటించనున్నారు చిత్రబృందం. ఈ విషయాన్ని అంగద్ బేడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘‘ రేపు ఉదయం 11 గంటలకు మేము అందమైన ప్రపంచంలోకి అడుగుపెట్టపోతున్న సందర్భంగా మాతో కలిసి నడవండి. #నాని30 మూవీ టైటిల్ ప్రకటన ఉంటుంది. ఈ సినిమా ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేయడం గర్వంగా ఉంది. శౌర్యవ్ సార్ ఇది నాకు మీరు ఇచ్చిన గొప్ప గౌరవం’’ కామెంట్ చేశాడు. కాగా అంగద్ బేడీ పోస్టుపై బాలీవుడ్ యాక్ట్రెస్ నేహా ధూపియా హార్ట్ ఎమోజీని పోస్టు చేసింది.

Advertisement

Next Story