Vijay Devarakonda-Rashmika: విజయ్ దేవరకొండపై ప్రేమ నిజమే.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన రష్మిక..!

by Kavitha |
Vijay Devarakonda-Rashmika: విజయ్ దేవరకొండపై ప్రేమ నిజమే.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన రష్మిక..!
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పుష్ప 2, సికిందర్, చావా, ది గర్ల్ ఫ్రెండ్, కుబేరుడు వంటి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. అయితే ఈమె గత కొద్ది రోజులుగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు ఓ రూమర్ షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరూ ఎక్కడికి వెకేషన్స్‌కి వెళ్ళినా కూడా దానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసుకుంటూ వెనక బ్యాక్ గ్రౌండ్ విషయంలో చాలాసార్లు మీడియాకు అడ్డంగా దొరికిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే అలాంటి ఈ బ్యూటీ రీసెంట్‌గా ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకి గెస్ట్‌గా వచ్చింది. ఇక ఈ షోలో రష్మిక‌కి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇందులో భాగంగా పుష్ప గురించి మాట్లాడుతూ పుష్ప-1 కంటే పుష్ప -2 భారీ స్థాయిలో ఉండబోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే నాక లైఫ్‌లో చూపే బంగారా మాయేనే శ్రీవల్లి, కడలల్లే అనే పాటలు ఎంతగానో ఇష్టం. కానీ, గీత గోవిందం మూవీలోని తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా అనే సాంగ్ మాత్రం నా మనసును ఎంతగానో హత్తుకునే సాంగ్ అని తెలిపింది రష్మీక. ఇక ఇదే షోలో మీకు ఎప్పుడైనా కోస్టార్ మీద లేక కొలీగ్ మీద ప్రేమ ఆర్ క్రష్ కలిగిందా అని హోస్ట్ శ్రీరామ చంద్ర అడగగా.. అవును అంటూ రష్మిక మందన్నా సమాధానం ఇచ్చింది. ఇక రష్మిక సమాధానానికి అక్కడున్న వారందరూ నవ్వేశారు. దీంతో రష్మిక చెప్పింది విజయ్ దేవరకొండ గురించేనని అందరూ ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ‌తో రష్మిక రెండు సినిమాల్లో నటించింది. అందుకే కోస్టార్ పై క్రష్ నిజమేనని ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పిందంటూ కొంతమంది దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరి రష్మిక మందన్నా ఎవరి గురించి చెప్పిందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

(video link credits to aha videoIN youtube channel)

Advertisement

Next Story