బిగ్‌బాస్ యావర్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన శివాజీ కూతురు!

by Hamsa |   ( Updated:2024-03-02 15:40:04.0  )
బిగ్‌బాస్ యావర్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన శివాజీ కూతురు!
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో పలు వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నయని పావని ఒకరు. ఈ అమ్మడు బిగ్‌బాస్ సీజన్-7 లో పాల్గొని ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇంట్లో ఉన్నది ఒక్క వారమే అయినప్పటికీ నయని పావని ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. ముఖ్యంగా శివాజీతో కూతురి బాండింగ్ ఏర్పరుచుకుని అందరి హృదయాలకు కొల్లగొట్టింది. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చాక నయని పావని బిగ్‌బాస్ సీజన్ - కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్‌తో పలు ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంది. అలాగే ఈ పాటల ప్రమోషన్స్ చేసేందుకు నయని, యావర్ పలు రొమాంటిక్ ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో వచ్చిన మాస్ సాంగ్స్‌కు జంటగా రీల్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో అంతా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని అందుకే అలా సన్నిహితంగా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు. దీనిపై వీరిద్దరు స్పందించినప్పటికీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా, నయని పావని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో ఓ నెటిజన్ మీరు యావర్‌తో లవ్‌లో ఉన్నారా అని అడిగాడు. దానికి నయని ‘‘అరే ఏంట్రా మీరు? ఇంకో ప్రశ్న లేదా.. లేదని ఎన్ని సార్లు క్లారిటీ ఇవ్వాలి’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story