ఆ సెలబ్రేషన్స్ ఆయనతోనే చేసుకోవాలనుంది : Lindsay Lohan

by sudharani |   ( Updated:2022-11-26 13:53:13.0  )
ఆ సెలబ్రేషన్స్ ఆయనతోనే చేసుకోవాలనుంది : Lindsay Lohan
X

దిశ, సినిమా : అమెరికన్ బ్యూటీ లిండ్సే లోహన్ తన భర్త బాదర్ షమ్మాస్‌తో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. దాదాపు రెండేళ్ల డేటింగ్ తర్వాత ఇటీవలే బాదర్‌ను పెళ్లి చేసుకున్న నటి.. హజ్బెండ్, అతని కుటుంబ సభ్యులతో క్రిస్మస్ సీజన్‌ను ఆహారం, ఆనందంతో నింపేయడానికి వేచి ఉండలేనని చెప్పింది. ఇక ప్రస్తుతం తన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం తనతో పాటు ప్రజలకు కూడా కొంత ఆనందాన్ని ఇస్తుందన్న ఆమె.. ఎల్లప్పుడూ స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒకచోట చేర్చి ఆనందమైన సమయాన్ని వీక్షించాలని ఆశిస్తుంటానని పేర్కొంది. అంతేకాదు ఫెస్టివల్ టైమ్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ చూస్తే సినిమా తీస్తున్న ఫీలింగే కలుగుతుందని చెప్పింది. అయితే దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఎన్నో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేసినప్పటికీ అవన్నీ తనకు నిజమైన భావనలను కలిగించలేదని.. నిజమైన కుటుంబం ప్రేమ, అందరితో సమానంగా ఉండే తీరు, హార్ట్‌ఫుల్ కామెడీనే తాను తెగ ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.

READ MORE

Los Angeles Times special article about RRR director SS Rajamouli

Advertisement

Next Story