ఆ విషయంలో సుకుమార్, రాజమౌళి దొందూ.. దొందే!

by Anjali |   ( Updated:2023-11-05 14:21:14.0  )
ఆ విషయంలో సుకుమార్, రాజమౌళి దొందూ.. దొందే!
X

దిశ,సినిమా: ప్రజంట్ ఇండస్ట్రీలో హీరోలే కాదు డైరెక్టర్లు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకొని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటి దర్శకులలో ముందుగా మనకు వినిపించే పేర్లు రాజమౌళి, సుకుమార్. ‘పుష్ప’తో సుకుమార్ ‘RRR’ ‘బాహుబలి’ వంటి చిత్రాలతో జక్కన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో వీరిద్దరి దర్శకత్వంలో సినిమా అంటే అది కచ్చితంగా హిట్ అని జనాల్లో ముద్ర పడిపోయింది.

అయితే తాజాగా రాజమౌళికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఏమిటంటే సుకుమార్ తన మూవీలో ఒక సీన్ సరిగా రాకపోతే అది వచ్చేవరకు పదేపదే టేక్స్ అంటూ బాగా హింసిస్తారట. అలా ‘పుష్ప’ సినిమాలో రష్మికను అల్లు అర్జున్ బాగా టార్చర్ చేశారట. ఇక రాజమౌళి కూడా అలానే చేస్తాడట. సీన్ బాగా రావడం కోసం టేక్‌ల మీద టేక్‌‌లు తీసుకుంటూ హింసిస్తాడట. ఇదే విషయాన్ని తారక్, ప్రభాస్, చరణ్ చాలా ఇంటర్వూలలో అన్నారు. దీంతో వీళ్లిద్దరికీ ఈ క్వాలిటీ పిచ్చి ఏంట్రా బాబు అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ‘వర్క్ మీద అలా కమిట్మెంట్ ఉండడం కారణంగానే వీళ్లిద్దరూ టాప్ డైరెక్టర్లుగా ఉన్నారు’ అని కామేంట్‌లు చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story