- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Double Smart: ‘డబుల్ ఇస్మార్ట్’ కు లైగర్ సెగ.. నైజాంలో చావుదెబ్బ కొట్టిన డిస్ట్రిబ్యూటర్లు?
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లకు ఉన్న అనుబంధం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం. సినిమా హిట్ అయిందంటే అందరూ సంతోషం.. డిజాస్టర్ అయిందంటే మాత్రం.. డిస్టిబ్యూటర్లు నిర్మాతల వెంట పడాల్సిందే. అది కూడా ముందు చేసుకున్న ఒప్పందం మేరకే ఉంటుంది. అయితే.. ఇలాంటి వివాదమే ‘లైగర్’ మూవీ విషయంలో గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో నటుస్తుంది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా చేశారు. దీంతో సినిమాలో ఆడియన్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సీఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. విజయ్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా ‘లైగర్’ ఉండటం విశేషం.
అయితే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ చూసి.. క్రేజీ ఆఫర్‌ను ఇచ్చి ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నాడు వరంగల్ శ్రీను. ఈ మూవీ హక్కులను మిగతా ఏరియాలకు అమ్మేసి.. నైజాంను మాత్రం రూ. 18 కోట్ల రేషియోలో.. ఆయనే సొంతంగా పంపిణీ చేశాడు. కానీ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో.. తన నష్టాల రికవరీ కోసం అప్పట్లో పూరి జగన్నాథ్ ఆఫీసు చుట్టు తిరిగాడు. అంతేకాదు దీనిపై కేసు కూడా వేసి.. సినీ ప్రముఖుల సపోర్ట్ కూడా కోరాడు. అంతేకాదు తన నష్టాలను రాబట్టుకోవడం కోసం అప్పట్లో ఫిల్మ్ చాంబర్ వద్ద దర్నాకు కూడా దిగాడు. అయినా ఫలితం లేదు. ఈ నిరసన సెగ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్’పై పడినట్లు తెలుస్తుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రామ్ పోతునేని హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో, ఫ్యాన్స్‌లో, సిని విశ్లేషకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ‘లైగర్’ థియేటర్ అడ్వాన్స్ డ్యూస్ సెగ తగిలింది. అందుకే ఆ ఇష్యూ సెటిల్ కాకుండా నైజాం ఏరియా హక్కులను తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్‌కు దగ్గరపడుతున్న నైజాం థియేటర్స్ కన్‌ఫర్మ్ కాలేదని తెలిసింది. అంతేకాదు ఇదే రోజు రిలీజ్ కాబోతున్న మాస్ మహా రాజ రవితేజ ‘మిస్టర్ బచ్చన్, చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ సినిమాలు నైజాంలో వీలున్ననన్ని థియేటర్లు బుక్ చేసుకోవాలని పోటీపడుతున్నారు. ఇంకా ఈ సమస్య తేల్చుకోవడం లేటైతే ‘డబుల్ ఇస్మార్ట్’ కంటే తంగలాన్ ఎక్కువ థియేటర్లు చేజిక్కించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఈ సమస్య ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది.