యూట్యూబ్‌‌లో ‘లియో’ ట్రైలర్ సరికొత్త రికార్డు

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-08 06:54:10.0  )
యూట్యూబ్‌‌లో ‘లియో’ ట్రైలర్ సరికొత్త రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లియో మూవీ ట్రైలర్ గురువారం రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో విజయ్ లియో ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. ఇక భారదేశ సినిమా చరిత్రలో కేవలం 20.5 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ సాధించిన తొలి చిత్రంగా నిలించింది. ట్రైలర్ యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఐదు నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్, 15 నిమిషాల్లో 2 మిలియన్ మార్క్ దాటింది.

లియో సినిమా వర్గాలు ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నాయి. ‘లియో ట్రైలర్ క్రియేటెడ్ వరల్డ్ రికార్డు లైక్స్’ అంటూ పోస్ట్ కామెంట్ పెట్టింది. పోస్టులో ప్రతి నిమిషానికి వచ్చిన లైక్స్ నెంబర్‌ని మూవీ టీం తెలిపింది. గతంలో విజయ్ బిజిల్ మూవీ 58 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ సాధించింది. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మాత. హీరోయిన్‌గా త్రిష నటించగా, సంజయ్ ద్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19 లియో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Next Story