Pawan Kalyan ను పక్కన పెట్టి Ravi Teja తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్న Harish Shankar..!!

by Prasanna |   ( Updated:2023-07-17 08:15:05.0  )
Pawan Kalyan ను పక్కన పెట్టి Ravi Teja తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్న Harish Shankar..!!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అభిమానుల కొసం వరుస ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కానీ అనుకున్న టైంకు ఒక మూవీ కూడా ఫినిష్ కావడం లేదు. దీంతో నిర్మాతలకు టెన్షన్ మొదలవుతుంది. ఇక పవన్ ఒప్పుకున్న మూవీస్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పుడో మూడేళ్ల క్రితం ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కేవలం మూడు షెడ్యూల్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతానికైతే పవన్ పూర్తి దృష్టి పొలిటికల్‌పైనే ఉంది. దీంతో ఆయన తన సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ ఈ గ్యాప్‌లో మాస్ మహారాజా రవితేజతో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. అదికూడా బాలీవుడ్ మూవీ ‘రైడ్’కు రిమేక్‌గా తెరకెక్కించే అవకాశం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఇవి కూడా చదవండి: జపాన్‌లో ‘Rangasthalam’ 4 డేస్ కలెక్షన్స్

Advertisement

Next Story