- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5 వేల వీధి కుక్కలను ఆమె ఇంట్లో వదలి తాళం వేయండి: Ram Gopal Varma
దిశ, వెబ్‌డెస్క్: నడి రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న నాలుగేళ్ల బాలుడుని వీధి కుక్కలు అతి దారుణంగా దాడి చేసి చంపేశాయి. ఆ వీడియో చూస్తే ఎంత కఠినాత్ములలైన కంటతడి పెడతారు. కానీ, ఈ ఘటనపై హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గద్వాల్ స్పందన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వీధి కుక్కలు ఆకలి తట్టుకోలేక బాలుడిపై దాడి చేశాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసాయి. దీంతో ఆమెపై ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం సోషల్ మీడియా వేదికగా ఆమెపై సెటైరికల్ ట్వీట్ చేశాడు.
అయితే మరోసారి వర్మ మేయర్‌పై విరుచుకుపడ్డాడు. కుక్కల దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ''కేటీఆర్ గారు నాకు ఏ డిపార్ట్‌మెంట్ దేనికి అనేది అంతా ఐడియా లేదు. మేయర్ గారిని మీరు పెట్టారా లేక ఎవరు పెట్టారు అనే పొలిటికల్ సిస్టం కూడా నాకు తెలియదు. కానీ, మేయర్ గారి కాంపౌండ్‌లోకి కనీసం 5 వేల వీధి కుక్కలను పంపి అన్నివైపుల నుంచి గేట్లు, తలుపులు తాళాలు వేసి వదిలేయండి. అప్పుడు ఆ 5 వేల కుక్కలపై ఆమె ఎలా ప్రేమ చూపిస్తుంది.. ఎంత ప్రేమ చూపిస్తుందో.. వాటికి తిండి ఎలా పెడతారనేది నేను ఒక్కడినే కాదు.. మొత్తం ప్రజలు అందరూ చూడాలి అనుకుంటున్నారు'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా.. కేవలం వ్యవస్థలు విఫలం వలనే ఆ దారుణం జరిగిందని ఆయన ఆరోపణ.
డాక్టర్ సైఫ్ అరెస్ట్.. ప్రీతిని అవమానించేలా వాట్సాప్‌లో మెసేజ్‌లు