లీకైన గుంటూరు కారం సాంగ్ షూట్.. మహేష్ బాబు స్టెప్పులు సూపర్..

by Prasanna |   ( Updated:2023-11-22 05:52:42.0  )
లీకైన గుంటూరు కారం సాంగ్ షూట్.. మహేష్ బాబు స్టెప్పులు సూపర్..
X

దిశ,వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు, స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ పనులు బ్రేక్స్ లేకుండా బిజీ బిజీ గా సాగుతున్నాయి. ఇటీవలే మేకర్స్ మూవీలోని మొదటి సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. 24 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్లింది. ఇంతక ముందు లాగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నాగ వంశీ రీసెంట్ ఒక అప్డేట్ ఇచ్చారు. గుంటూరు కారంలో తర్వాత రాబోయే మూడు పాటలు అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. గుంటూరు కారం మూవీలో ఓ పాటకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మహేష్ బాబు ఓ పాటకు డాన్స్ వేస్తూ కనిపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మహేష్ బాబు డాన్స్ ఇరగదీస్తున్నారు.. బాబు స్టెప్పులు సూపర్ డాన్స్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story