బేబితో దర్శనమిచ్చిన లావణ్య త్రిపాఠి.. ఆ స్పెషల్ డేట్‌కే పుట్టాడంటూ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-05-20 07:26:11.0  )
బేబితో దర్శనమిచ్చిన లావణ్య త్రిపాఠి.. ఆ స్పెషల్ డేట్‌కే పుట్టాడంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలు అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. వివాహం తర్వాత ‘మిస్ ఫర్‌ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. కానీ దాని తర్వాత మరే కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకుండా.. పూర్తిగా పర్సనల్‌ లైఫ్‌పై దృష్టి పెట్టింది. భర్తతో పలు వెకేషన్స్‌కు వెళ్తు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.

అప్పుడప్పుడు తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ కూడా చేసి పలు విషయాలు తెలుపుతుంది. అయితే ఆమె ఇటీవల మామిడికాయ పచ్చడి పెట్టిన తీరుపై పలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ అత్తమ్మాస్ కిచెన్ టీమ్ స్పందించి క్లారిటీ ఇవ్వడంతో నెగిటివ్ కామెంట్లకు చెక్ పడినట్లు అయింది.

ఈ క్రమంలో.. తాజాగా, లావణ్య త్రిపాఠి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. తన అన్నయ్య కొడుకును ఎత్తుకుని ఉన్న పిక్ పెడుతూ.. ‘‘ నువ్వు నేను ఒకే రోజు పుట్టాము. మన ఇద్దరి పుట్టినరోజు తేదీలు సేమ్. కానీ సంవత్సరం వేరు’’ అని రాసుకొచ్చింది. కానీ ఆ బాబు ఫేస్‌ను కనిపించకుండా జాగ్రత్త పడింది. ఈ ఫొటోల లావణ్య, తన అల్లుడితో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా మెగా వారసుడిని ఎప్పుడు ఇస్తావని కామెంట్లు పెడుతున్నారు.

Read More..

టాలీవుడ్ ఇండస్ట్రీపై కాజల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో మార్పు రాలేదంటూ నిజాలు బయటపెట్టేసిందిగా!

Advertisement

Next Story