- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల నెరవేరింది.. పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య త్రిపాఠి
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సొట్ట బుగ్గల హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా జరుపుకున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా.. పెళ్లిపై లావణ్య త్రిపాఠి తొలిసారి స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫొటోలు పంచుకుంది.
‘వరుణ్ తేజ్ ఒక అద్భుతమైన వ్యక్తి. నన్ను ఎంతో పదిలంగా చూసుకునే అలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అతడే తన భర్త అయ్యాడు. ఈ సందర్భంగా ఎన్నో చెప్పాలి అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇలాంటి ముచ్చట్లు మా మధ్యనే ఉంచుకుంటాం. మూడ్రోజుల పాటు సాగిన మా పరిణయ మహోత్సవం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఓ తియ్యని కలలా సాగింది. మా వివాహం ఎలా జరగాలని కోరుకున్నామో అలాగే జరిగింది. దీంతో నా కల నెరవేరింది. మా పెళ్లి చిరస్మరణీయంగా జరిగేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ లావణ్య తన పోస్టులో పేర్కొంది.
Read More..