అనాథ పిల్లలకు లావణ్య త్రిపాఠి చేయూత (ఫోటోస్ వైరల్)

by Anjali |   ( Updated:2023-04-26 14:39:44.0  )
అనాథ పిల్లలకు లావణ్య త్రిపాఠి చేయూత (ఫోటోస్ వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘అందాల రాక్షసి’’ సినిమాతో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల బ్యూటీ లావణ్య త్రిపాఠి ... తనదైన అందంతో, నటనతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ నటి తాజాగా ఎల్బీనగర్‌లో ఉన్న ‘‘ఆనంద విద్యార్థి గృహాం’’ అనాథ ఆశ్రయానికీ వెళ్లి.. అక్కడి పిల్లలతో కాసేపు సమయాన్ని కేటాయించింది. ఈ ఆశ్రమం వ్యవస్థాపకుడు మార్గం రాజేష్‌ను మీట్ అయి ఆశ్రమం వివరాలను అడిగి తెలుసుకుంది. విద్యార్థులు క్లీనింగ్, వంట తామే చేసుకోవడం, సొంతంగా సెలూన్, అలాగే కుట్టు మిషన్స్ కూడా కలిగి ఉండడంతో .. దీంతో లావణ్య విద్యార్థుల ప్రతిభ చూసి ఎంతో సంతోషపడింది.

పిల్లలకు కావల్సిన అత్యవసర టాబ్లెట్స్‌ను అందుబాటులో ఉండేట్లు బహుమతిగా అందించి.. గొప్ప మనసును చాటుకున్నారు. తర్వాత వారికి భోజనం వడ్డించి.. పిల్లలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు మీరు హీరోయిన్ ఎలా అయ్యారు ? అని ప్రశ్నించగా.. ‘‘నా ఫ్యామీలి తరపున సినిమా ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అయినా 11 సంవత్సరాలు ఎన్నో కష్టాలను అధిగమించి, ఈ స్థాయిలో ఉన్నానని’’ తెలిపారు. అలాగే ‘ఈ రోజు పిల్లలతో టైమ్ స్పెండ్ చేసినందుకు, మీరు నాకు చేసిన మర్యాదలకు నేను థ్యాంక్యూ చెప్పుకుంటున్నాను, నా వంతు సహాయం ఎప్పటికీ చేస్తూనే ఉంటానని’ చెప్పుకొచ్చారు.’ ఈ బ్యూటీ అనాథ పిల్లలతో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.


Also Read...

అనుష్కాతో సెల్ఫీ దిగాలని చూసిన ఫ్యాన్.. సీరియస్ అయిన విరాట్.. (వీడియో)

Advertisement

Next Story