మెగా కోడలు లావణ్య త్రిపాఠితో సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్.. కానీ..?

by Anjali |   ( Updated:2024-02-05 12:32:17.0  )
మెగా కోడలు లావణ్య త్రిపాఠితో సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్.. కానీ..?
X

దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి సుపరిచితమే. కొన్నాళ్లపాటు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుధీర్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో గోట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే సుధీర్ నేనోరకం, సాఫ్ట్‌వేర్ సుధీర్, మంకీస్, కాలింగ్ సహశ్ర, కోతల రాయుడు , వాంటెడ్ పండుగాడ్, గాలోడు, కాలింగ్ సహస్ర వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.

అయితే ఈ కమెడియన్‌కు మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. లావణ్య మిస్ ఫర్ ఫెక్ట్ వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ సిరీసుకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇందులో మెగా కోడలు ఓసీడీ గల అమ్మాయిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

అయితే ఈ సిరీస్ కోసం మేకర్స్ మొదటగా అభిజిత్ ప్లేస్ లో సుడిగాలి సుధీర్‌ను ఎంపిక చేసుకున్నారట. కానీ అప్పటికే టాలీవుడ్ లొట్టచెంపల హీరోయిన్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రేమలో ఉందట. ఈ విషయం తెలుసుకున్న సుధీర్.. ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఎందుకంటే.. సుధీర్‌కు నాగబాబునే బుల్లితెరై అవకాశం ఇచ్చారనే విషయం తెలిసిందే. తనకు లైఫ్ ఇచ్చిన ఇంటి కోడలితో సుధీర్ నటించడం సమంజసం కాదని భావించి.. అతడు ఆ వెబ్ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story