Lawrence-Nayanatara కాంబోలో హారర్ థ్రిల్లర్ మూవీ

by Nagaya |   ( Updated:2023-07-18 14:14:17.0  )
Lawrence-Nayanatara కాంబోలో హారర్ థ్రిల్లర్ మూవీ
X

దిశ, సినిమా: లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, హారర్ స్టోరీస్ అంటే హీరోయిన్ నయనతారకు స్పెషల్ ఇంట్రెస్ట్ అన్న విషయం తెలిసిందే. కాగా మరోవైపు దర్శకుడు, నటుడు లారెన్స్ సైతం హారర్ చిత్రాలు తీయడంలో దిట్ట అనేది కాంచన, గంగ, శివలింగ వంటి సినిమాలతో ప్రూవ్ అయింది. ఇక రీసెంట్‌గా ‘చంద్రముఖి 2’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న లారెన్స్ తాజాగా మరో ప్రాజెక్ట్‌ని ఓకే చేశారు. ఇది కూడా హారర్ మూవీ కావడం విశేషం. రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి లొకేష్ కనగరాజ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న మూవీ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ సెట్స్‌పైకి వెళ్తుంది. కాగా హారర్ సినిమాలు చేయడంలో మంచి అనుభవం ఉన్న లారెన్స్ - నయనతార కలిసి నటిస్తున్న ఈ మూవీ జనాలను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. బ్లాక్ బస్టర్ సినిమా రీరిలీజ్!

Advertisement

Next Story