బాలయ్యకు లక్ష్మీ పార్వతి సవాల్.. నన్ను అన్ స్టాపబుల్ షోకు పిలుస్తావా అంటూ..

by samatah |
బాలయ్యకు లక్ష్మీ పార్వతి సవాల్.. నన్ను అన్ స్టాపబుల్ షోకు పిలుస్తావా  అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : చంద్రబాబు, నందమూరి ఫ్యామిలీపై ఎప్పుడో ఏదో ఒక కామెంట్ చేసేవారిలో లక్ష్మీ పార్వతి ముందుంటారు. తన తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి నందమూరి ఫ్యామిలీ సపోర్టు చేస్తుంది. అంటా చాలా సార్లు వారిపై విరుచుకపడింది.

అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. బాలకృష్ణను టార్గెట్ చేస్తూ, లక్ష్మీ పార్వతీ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి ఆమె మాట్లాడుతూ.. నందమూరి తారకరత్న మరణించడం చాలా బాధకరం. ఆయన మురణం నన్ను చాలా కలిసివేసింది అంటూ చెప్పుకొచ్చింది. నా భర్తను ఆ చంద్రబాబు ఎలా వెన్ను పోటు పొడిచాడో నాకు తెలుసు. ఆసమయంలో తన కొడుకులు కూడా నా భర్తకు సపోర్టుగా లేరు, ఎన్టీ ఆర్ పార్టీ పెట్టిన తర్వాత తన ఆస్తి మొత్తాన్ని తన కొడుకులు, కూతుర్ల పేరు మీదే రాశారు. అప్పటి ప్రతి విషయం నాకు తెలుసు, నేనే సాక్ష్యం, ధైర్యం ఉండే బాలకృష్ణను నన్ను ఒక్కసారి అన్ స్టాపబుల్ షోకి పిలవమనండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Advertisement

Next Story