సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ లగ్గం రెడీ..మన ఇంట్లో పెళ్లిలా ఉటుందంటూ కామెంట్స్!

by Disha Web Desk 8 |
సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ లగ్గం రెడీ..మన ఇంట్లో పెళ్లిలా ఉటుందంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా : భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమా పేరే లగ్గం. ఈ మూవీలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రపోషిస్తున్నాడు. అయితే పెళ్లి అనేది ఒక్కో ప్రాతంలో ఒక్కో విధంగా జరుగుతుంది. కొన్ని చోట్ల మూడు రోజులు జరిగితే మరికొన్ని చట్ల ఐదురోజులు, ఇంకొన్ని చోట్ల ఒక రోజు మాత్రమే జరుగుతుంది. ఇక పెళ్లి అనగానే ఆ ఇంట్లో ఉండే సందడే వేరుంటుంది. అలాంటి సందడిని తెరపై చూపించనున్నాడు రమేష్ చెప్పాల.

లగ్గం చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు నిండి ఉన్నాయని, ఇది చక్కటి ప్రేమ కథ చిత్రమని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు.అలాగే ఈ సినిమాలోని ఆట,పాట ప్రతి ఒక్కరికీ తమ బంధువుల లగ్గాన్ని గుర్తు చేస్తుందని నిర్మాత తెలిపారు. ఇక ఈసినిమా షూటింగ జనవరిలో మొదలు పెట్టగా, నిన్నటితో టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్, రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, రఘుబాబు, రోనక్, ప్రగ్యా నగ్రా,కృష్ణుడు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Next Story

Most Viewed