మరోసారి సూపర్ కాంబో రిపీట్.. సమంత, అనుపమ కాంబినేషన్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీ?

by Disha Web Desk 8 |
మరోసారి సూపర్ కాంబో రిపీట్.. సమంత, అనుపమ కాంబినేషన్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీ?
X

దిశ, సినిమా : ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బ్యూటీస్‌ను చూడాలని ఎవరు కోరుకోరు. అలాంటి ఒకే సినిమాలో ఇద్దరు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కనిపిస్తే ఇక ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేము. అయితే తాజాగా ఓ సూపర్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

టిల్లుగాడితో రొమాన్స్ చేసిన లిల్లీ మరో సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతుందంట. అది హీరోతో కాదు.. ఓ స్టార్ హీరోయిన్‌తో.. అదేంటి ఇద్దరు హీరోయిన్స్ సినిమా చేయడం అనుకుంటున్నారా? అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు స్టార్ హీరోయిన్స్ త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతున్నారంట. అనుమప, సమంత ఇద్దరు కలిసి త్వరలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారని, ఈ సినిమాకు ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో తివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ఆహా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీరి కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆ రోజుల్లోనే ఓ స్టార్ డైరెక్టర్ వీరితో కలిసి మంచి ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడంట. అందులో భాగంగానే వీరిద్దరికి కథ వినిపించాడని, ఈ ముద్దుగుమ్మలకు స్టోరీ నచ్చడంతో మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా, దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇక మయోసైటీస్ సమస్యతో కొన్ని రోజులు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న సమంత మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సామ్ ప్రస్తుతం తెలుగులో రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుపమ, ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీ బిజీగా ఉంటుంది. కాగా, వీరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read More..

చాయ్ అన్నావా.. చై అన్నావా.. శోభిత లేటెస్ట్ పోస్ట్‌పై నెట్టంట రచ్చ!

Next Story

Most Viewed