సంచలనం సృష్టిస్తోన్న కుమారి ఆంటీ కామెంట్స్.. ఏకంగా మెగాస్టార్, మరోస్టార్ సినిమాలనే రిజెక్ట్ చేసిందిగా?

by Anjali |   ( Updated:2024-03-21 08:37:37.0  )
సంచలనం సృష్టిస్తోన్న కుమారి ఆంటీ కామెంట్స్.. ఏకంగా మెగాస్టార్, మరోస్టార్ సినిమాలనే రిజెక్ట్ చేసిందిగా?
X

దిశ, సినిమా: ‘మీది మొత్తం 1000 అయింది రెండు లివర్స్ ఎక్స్ట్రా’ అనే డైలాగ్ తో కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో తెలిసిందే. ఈ ఒక్క వీడియోతో కుమారి ఆంటీ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈమె ఫేమస్ అయినప్పటి నుంచి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ వస్తుంది. సినిమా రేంజ్‌లో కార్తీక దీపం.. చరిత్రలోనే తొలిసారి సీరియల్‌కు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్.

అయితే కార్యక్రమానికి కుమారి ఆంటీ వెళ్లగా.. ఓ న్యూస్‌ చానల్‌ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. రేవంత్‌ రెడ్డి స్పందించిన అనంతరం ఆమె వ్యాపారం ఎలా ఉందని యాంకర్‌ ప్రశ్నించారు. అలాగే సీరియల్స్‌లో, మూవీల్లో చాన్స్ లు ఏమైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. వీటికి కుమారి ఆంటీ బదులిస్తూ.. ‘‘కొందరు చానల్స్‌ వాళ్లు వచ్చి అడిగారు. ఇక మా పిల్లలు చెప్పడంతో సీరియల్స్‌ కు నటించాను. అంతకుముందే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నాను. ఇంద్రజ, ఆది.. పలువురితో కలిసి నటించాను. కానీ నటించేప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ టైం కదా? ఇబ్బంది అనిపించింది.

సీరియల్స్‌లో నటించినందుకు ఏమైనా డబ్బు ఇచ్చారా? అని అడగ్గా.. ‘నేను ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. కానీ నేను అక్కడికి తీసుకెళ్లిన ఫుడ్ కు మాత్రం మనీ ఇచ్చారని తెలిపింది. మరీ సినిమాల్లో ఏం అవకాశాలు రాలేదా?అని ప్రశ్నించగా.. రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. నా పుడ్ వ్యాపారం వల్ల నాకు కుదరదని చెప్పేశా. కొన్ని డేస్ బిజినెస్ వదులుకుని మూవీల్లో నటించమని అన్నారు. నాకు జీవితం ఇచ్చిన పుడ్ కోర్టును వదిలిపెట్టనని డైరెక్ట్ చెప్పేశా. అంటూ ఆంటీ చెప్పుకొచ్చింది. అయితే ఈ రెండు మూవీస్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలని నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు.

Read More..

వరుణ్, లావణ్యను ప్రేమించకపోతే ఆ స్టార్ హీరో కుమార్తెను పెళ్లిచేసుకునేవాడు.. బాంబ్ పేల్చిన నాగబాబు?

Advertisement

Next Story