Bollywood : పెళ్లికి ముందే గర్భం దాల్చిన కియారా.. ట్రెండ్ ఫాలో అయిందట?

by Prasanna |   ( Updated:2023-02-15 08:20:10.0  )
Bollywood : పెళ్లికి ముందే గర్భం దాల్చిన కియారా.. ట్రెండ్ ఫాలో అయిందట?
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ క్రేజీ కపుల్స్‌ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాల రిలేషన్‌పై నటుడు, విమర్శకుడు కేఆర్‌కే షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుని ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్న ఈ స్టార్స్ మ్యారేజ్‌కు ముందే శారీరకంగా ఒక్కటయ్యారని, అలియా లాగే కియారా కూడా వివాహానికి ముందే గర్భం దాల్చినట్లు పరోక్షంగా సెటైర్లు వేశాడు. ఈ మేరకు కమల్ చేసిన ట్వీట్‌లో 'గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ కొత్త ట్రెండ్. ఇండస్ట్రీలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయింది. చాలా బాగుంది' అంటూ తనదైన స్టైల్‌లో కియారా ప్రెగ్నెంట్ చర్చకు దారితీశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా కొంతమంది కేఆర్‌కే‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. 'నీకు సమాచారం ఇచ్చే సీక్రెట్ సోర్స్ ఏమిటి? కియారా, సిద్ ఏమైనా కాల్ చేసి చెప్పారా?' అంటూ ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : Varalaxmi Sarathkumar : ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి వాళ్లకు విలువ లేదు: వరలక్ష్మీ

Advertisement

Next Story