Shraddha Kapoor: శ్రద్ధ బికినీ లుక్‌ను ఎగతాళి చేసిన కమల్.. ఆమెలో ఏముందంటూ

by Prasanna |
Shraddha Kapoor: శ్రద్ధ బికినీ లుక్‌ను ఎగతాళి చేసిన కమల్.. ఆమెలో ఏముందంటూ
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బికినీ పోజులను నటుడు కేఆర్‌కే దారుణంగా ఎగతాళి చేశాడు. ఇటీవల వచ్చిన ‘తూ ఝూఠీ మైన్ మక్కార్’ సినిమాలో ఆమె వేషాధారణను దీపిక, కత్రిన, కరీనలతో పోలుస్తూ..బాడీ షేమింగ్ చేశాడు. ‘శ్రద్ధా కపూర్‌ను బికినీలో పదే పదే చూపించారు. మిస్టర్ లవ్ రంజన్.. మీరు శ్రద్ధలో ఏం చూపించడానికి ప్రయత్నించారు? ఆమె దీపికా పదుకొనే కాదు. కత్రినా కైఫ్ అంతకన్నా కాదు. లాస్ట్‌కు కరీనా కపూర్ కూడా కాదు. అయినా మీరు ఆమెలో ఏం చూపించాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు? ఏమీ లేని అమ్మాయిని హైలెట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఆమెను బికినీలో చాలాసార్లు చూపించడానికి కారణమేంటి? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా నిరూపించండి?’ అంటూ ఎద్దేవా చేశాడు.

Advertisement

Next Story

Most Viewed