Kriti sanon: ప్రభాస్ సినిమాపై కూడా విమర్శలు వస్తాయా?.. ఊహించలేదంటున్న హీరోయిన్

by Prasanna |   ( Updated:2023-02-11 08:11:33.0  )
Kriti sanon: ప్రభాస్ సినిమాపై కూడా విమర్శలు వస్తాయా?.. ఊహించలేదంటున్న హీరోయిన్
X

దిశ, సినిమా: 'ఆదిపురుష్' టీజర్ మీద ఇలాంటి కామెంట్లు వస్తాయని ఊహించలేదంటోంది కృతిసనన్. అంతేకాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాపై ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ట్రోలింగ్ చూసి ఆశ్చర్యం, ఆందోళన కలిగిందని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. 'ఈ సినిమాపై వెల్లువెత్తిన విమర్శలు చూసి బాధపడ్డాను. టీజర్ చూసి అందరూ సోషల్ మీడియా వేదికగా తిట్టడం ప్రారంభించారు. ఈ ట్రోలింగ్‌ను ఓం రౌత్ తట్టుకోలేకపోయాడు. దీంతో చిత్రాన్నీ తీర్చిదిద్దేందుకు సిద్దమయ్యాడు. టీ సిరీస్ కూడా మరింత ఖర్చు చేసేందుకు ముందుకొచ్చింది. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోంది. ఈ మూవీ మీద నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ సీజీ, వీఎఫ్‌ఎక్స్ పనులను చేస్తున్నారు. త్వరలోనే బిగ్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తాం' అంటూ సినిమాకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేసింది.

Advertisement

Next Story