- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయాలు లేకున్న వరుస ఆఫర్లు అందుకుంటున్న కుర్ర హీరోయిన్..!
దిశ, సినిమా: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. మూవీ పేరుకు తగ్గట్టుగానే.. ‘ఉప్పెన’ మాదిరిగా మొదటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారి వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. తన నటనతో, అందంతో కుర్రాళ్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే.. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు కృతికి. ఉప్పెన తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో సక్సెస్ అందుకున్నప్పటికీ.. తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’, ‘వారియర్’, ‘కస్టడీ’ మూవీస్‌తో వరుస ప్లాప్‌లు ఎదుర్కొంది. దీంతో అమ్మడు గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య సినిమాలు తప్ప.. మరో ప్రాజెక్ట్‌పై సైన్ చేసినట్లు వార్తలు వినిపించలేదు. కానీ, ఏమైందో తెలియదు సడెన్‌గా కృతి శెట్టి జాతకం మారినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చెంతకు మళ్లి ఆఫర్లు వస్తున్నాయట.
అయితే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. నెట్టింట గ్లామర్ దోస్ మరింత పెంచింది. ఎప్పటికప్పుడు వెరైటీ ఫొటో షూట్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక తాజాగా కృతి శెట్టి బెల్లీ డ్యాన్స్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కారణంగా కూడా ప్రస్తుతం బేబమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నట్లు టాక్. అంతే కాకుండా యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాలు కూడా ప్రస్తుతం ప్లాప్‌లు ఎదుర్కొవడంతో కృతి శెట్టి వైపు అడుగులు వేస్తున్నారట డైరెక్టర్లు. కాగా.. కృతి శెట్టి ప్రస్తుతం మలయాళంతో పాటు తమిళంలో భారీ సినిమాల్లో నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలు హిట్ అయితే.. బేబమ్మ మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
- Tags
- krithi shetty