పెళ్లికాకముందే తల్లి కాబోతున్నా కృతి శెట్టి.. షాక్‌లో ఫ్యాన్స్!

by Jakkula Samataha |
పెళ్లికాకముందే తల్లి కాబోతున్నా కృతి శెట్టి.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హోదా సొంతం చేసుకుంది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ రావడం మొదలు పెట్టాయి. స్టార్ హీరోల సరసన వరసగా ఆఫర్స్ కొట్టేసింది. కానీ ఈ అమ్మడుకు అంతగా అదృష్టం కలిసి రాలేదు. నాగచైతన్యతో చేసిన బంగార్రాజు సినిమా తప్పితే సరైన హిట్ ఈ అమ్మడు ఖాతాలో పడలేదు. దీంతో టాలీవుడ్‌లో కృతి శెట్టికి అవకాశాలు రావడం లేదు అనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? కృతి శెట్టి పెళ్లి కాకుండానే తల్లికాబోతుందంట. అయితే ఇది నిజ జీవితంలో కాదండి. ఓ సినిమాలో మాత్రమే, ఆమె నటిస్తున్న ఓ కొత్త సినిమాలో కృతి తల్లి క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న మనమే అనే సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిదే. అయితే ఈ మూవీలో కృతి శెట్టి సుబ్రద అనే మదర్ క్యారెక్టర్ లో కనిపించనుందంట. ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌లో చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed