ఆ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసిన Krithi Shetty

by sudharani |   ( Updated:2023-07-06 16:01:16.0  )
ఆ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసిన Krithi Shetty
X

దిశ, సినిమా: ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఈ గుర్తింపును ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. చిత్రాలు ఎంచుకోవడంలో క్లారిటీ మిస్ అయి వరుస ఫ్లాప్‌లు అందుకుంది. ప్రస్తుతం ఒక్క ఛాన్స్ ఇచ్చిన చాలనే పరిస్థితిలో ఉంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం బేబమ్మ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి చేయబోతున్న 'జీని' చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయింది. తాజాగా ఈ సినిమా లాంచ్ ఘనంగా జరగ్గా.. కృతితో పాటు కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి సైతం నటించనున్నారు. దేవయాని కీలకపాత్ర పోషించనుంది. అర్జునన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆ నటి, ఆమె కూతురు ఇద్దరూ సెక్స్ బానిసలే.. పెళ్లైనా కూడా ఇతర వ్యక్తులతో అదే పని.. ట్వీట్ వైరల్

Advertisement

Next Story