రిలేషన్‌లో ఉన్నట్లు కన్ఫామ్ చేసిన కృతి శెట్టి.. ఎవరితోనో ఓపెన్‌గా చెప్పేసిందిగా!

by Jakkula Samataha |
రిలేషన్‌లో ఉన్నట్లు కన్ఫామ్ చేసిన కృతి శెట్టి.. ఎవరితోనో ఓపెన్‌గా చెప్పేసిందిగా!
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న ఈ నటి, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఐరన్ లెగ్‌గా మారిపోయింది. ఆమె చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ కావడంతో, ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆశించిన మేర అవకాశాలు రావడం లేదు అన్నట్లు తెలుస్తోంది. దీంతో కృతి కోలీవుడ్ వైపు ఇంట్రెస్ట్ చూసి అక్కడ అవకాశాల కోసం తెగ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ప్రస్తుతం కృతిశెట్టి తెలుగులో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మనమే చిత్రంలో హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ జూన్7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి తాను రిలేషన్‌లో ఉన్నట్లు కన్ఫామ్ చేసింది. అయితే ఇంటర్వ్యూలో యాంర్ మీరు రిలేషన్‌లో ఉన్నారా అని అడగ్గా అవును అని సమాధానం ఇచ్చింది. దీంతో ఎవరితో అని మరోసారి ప్రశ్నించగా, నేను నా ఫ్రొఫెషన్, నా వర్క్‌తో రిలేషన్‌లో ఉన్నానంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కృతి శెట్టి నటించిన మనమే చిత్రం విడుదలై మంచి సక్సెస్ అందుకుంటే ఈ అమ్మడుకు మరోసారి లక్ కలిసినట్లే అంటున్నారు తన అభిమానులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ మూవీపై కృతి చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story