అవి చేయొద్దని అమ్మ వార్నింగ్ ఇచ్చింది: Kriti Sanon

by Harish |   ( Updated:2022-11-03 13:12:27.0  )
అవి చేయొద్దని అమ్మ వార్నింగ్ ఇచ్చింది: Kriti Sanon
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ కృతిసనన్ తను నటించబోయే ప్రాజెక్ట్‌లకు సంతకం చేసేముందు కుటుంబంతో చర్చిస్తానంటోంది. అంతేకాదు ఆ కథకు సంబంధించిన పూర్తి వివరాలను, ఆలోచనలను అందరితో డిస్కస్ చేస్తున్నట్లు అంగీకరించింది. ఇటీవలే ఓ నెట్‌ఫ్లిక్స్ స్టోరీని రిజెక్ట్ చేసినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించిన బ్యూటీ.. తన తల్లి అలాంటి చిత్రాలు చేయొద్దని కోరినట్లుగా గుర్తుచేసుకుంది.

'మా అమ్మ గీతా సనన్.. కెరీర్ మొదట్లో లస్ట్ స్టోరీలు చేయొద్దని చెప్పింది. ఎందుకంటే అలాంటి సన్నివేశాల్లో నన్ను చూడటం వారికి అసౌకర్యంగా ఉంటుందన్నారు. అయితే దాన్ని కేవలం ఉద్వేగంతో కూడిన భావనగా అర్థం చేసుకోవాలని చెప్పేందుకు ప్రయత్నించా. అప్పుడు షార్ట్ ఫిల్మ్ అయితే ఒకే. ఎందుకంటే అది 20 నిమిషాల్లో ముగుస్తుంది కాబట్టి సమస్యగా ఉండదు' అని స్పష్టం చేశారని చెప్పుకొచ్చింది.

అయితే వాళ్లది అభద్రతా భావం లేదంటే తన మీద ప్రేమ ఇంకేమైనా కావొచ్చన్న నటి తాను వాళ్ల మాటలను ఎప్పుడూ తప్పుగా భావించలేదని వెల్లడించింది.

Advertisement

Next Story