- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kriti sanon , Prabhas :ఎఫైర్ నిజమే.. బయట పెట్టిన బాలీవుడ్ హీరో
దిశ, వెబ్‌డెస్క్: సినీరంగంలో హీరో, హీరోయిన్లపై పుకార్లు కామెన్. అదే స్టార్స్ అయితే ఇంకా జోరుగా సాగుతాయి. ఈ క్రమంలో ప్రభాస్, కృతి సనన్‌పై ఈ మధ్య కాలంలో చాలా పుకార్లు వచ్చాయి. వారిద్దరు రిలేషన్లో ఉన్నరంటూ సోషల్ మీడియా కోడై కూసింది. వీటికి తోడు ఓ సందర్భంలో కృతి సనన్.. ప్రభాస్‌తో నేను పెళ్లికి రెడీ అంటూ సంచలనం సృష్టించింది. అయితే ఈ మాటలన్నీ ప్రభాస్‌పై అభిమానంతో చెప్పలేదని.. నిజంగా రిలేషన్ ఉండబట్టే చెప్పి ఉంటుందని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతుంది.
విషయానికి వస్తే.. వరుణ్ ధావత్, కృతి జంటగా నటించిన సినిమా 'బేడియా'. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరుణ్, కృతి ఓ బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. ఆ షోలో యాంకర్‌గా కరణ్ జోహార్ వ్యవహరించారు. అయితే కరణ్.. కృతి పేరు నీ గుండెళ్లో ఎందుకు లేదు అని వరుణ్ని ప్రశ్నించాడు. దానికి వరుణ్ స్పందిస్తూ.. కృతి పేరు వేరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేడని.. దీపిక పదుకొనెతో వేరేచోట షూటింగ్లో ఉన్నాడని కామెంట్ చేశాడు. వరుణ్ కామెంట్స్‌కి కృతి నవ్వుతున్నట్లు కనిపించినా ఇబ్బందికర హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చింది. దీంతో ప్రభాస్, కృతిలు నిజంగానే రిలేషన్లో ఉన్నారు అనే అనుమానం మరింత బలపడింది. కాగా.. హైదరాబాద్‌లో ప్రభాస్ దీపికా పదుకొనెతో షూటింగ్లో ఉన్న విషయం తెలిసిందే.