ఆయన గురించి అడగడంతో ఇబ్బందిపడిన కృతి సనన్.. కరెక్ట్ టైమ్ కాదంటూ..

by Hamsa |   ( Updated:2023-10-10 14:58:44.0  )
ఆయన గురించి అడగడంతో ఇబ్బందిపడిన కృతి సనన్.. కరెక్ట్ టైమ్ కాదంటూ..
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌ క్యారెక్టర్‌పై నటి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ‘జీ సినిమా అవార్డ్స్ 2023’ ఫంక్షన్‌కు హాజరైన ఆమెను ‘కార్తిక్ ఆర్యన్‌లో మీకు నచ్చిన అంశం ఏంటీ?’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమెను చూసి.. దురుసుగా సమాధానం చెబుతుందని భావించాడు.

కానీ, వెంటనే స్మైల్ ఇస్తూ.. ‘అలాంటి విషయాలకు సమాధానమివ్వడానికి ఇది సరైన వేదిక కాదు’ అంటూ ఆన్సర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ‘అల వైకుంఠపురంలో’ సినిమాను హిందీలో ‘షెహజాదా’ టైటిల్‌తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలావుంటే.. కృతి సనన్ నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కానుంది.

Advertisement

Next Story