స్టార్ హీరోలపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్.. చిన్న చూపు చూస్తురంటూ ఎమోషనల్ అయిన బ్యూటీ

by sudharani |   ( Updated:2024-04-12 12:57:15.0  )
స్టార్ హీరోలపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్.. చిన్న చూపు చూస్తురంటూ ఎమోషనల్ అయిన బ్యూటీ
X

దిశ, సినిమా: బ్యూటీ ఫుల్ హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఈ చిత్రం అనుకున్నంత మంచి ఫలితం దక్కకపోవడంతో నటన పరంగా పర్వాలేదు అనిపించుకుంది కానీ, ఆఫర్లు మాత్రం అనకున్నంత రేంజ్‌లో దక్కించుకోలేక పోయింది ఈ బ్యూటీ. తర్వాత నాగ చైతన్యకు జంటగా ‘దోచేయ్’ మూవీలో నటించగా అది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది కృతి. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంటున్న కృతి ససన్.. గత ఏడాది ఆదిపురుష్ మూవీతో మరలా తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. స్టార్ హీరోలు, నిర్మాతల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘స్టార్ హీరో, లేక పెద్ద హీరో అయినంత మాత్రన ప్రేక్షకులు సినిమాలు చూడరు. కథ నచ్చితే వాళ్లు కచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సినిమా బాగుంటే ఆడా, మగా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి సక్సెస్ చేస్తారు. కానీ, బాధాకర విషయం ఏమిటంటే నిర్మాతలు ఇప్పటికీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చిన్న చూపు చూస్తున్నారు. ఈ విధానంలో మార్పు రావాలి. ‘క్రూ’ మూవీలో స్టార్ హీరోలు ఎవరూ లేకపోయినా బాగానే ఆడుతుంది. అంటే సినిమా బాగుంటే హీరోలతో అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

Advertisement

Next Story