Kriti Sanon : వ్యాపార వేత్తను లైన్‌లో పెట్టిన కృతి సనన్.. భారీ ప్లాన్ వేసిందంటున్న నెటిజన్స్!

by Javid Pasha |
Kriti Sanon : వ్యాపార వేత్తను లైన్‌లో పెట్టిన కృతి సనన్.. భారీ ప్లాన్ వేసిందంటున్న నెటిజన్స్!
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా అలరిస్తోంది. 2014లో రిలీజైన ‘నేనొక్కడినే’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత నాగ చైతన్యకు జోడీగా దోచేయ్ మూవీలో చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ ఆఫర్లు రావడంతో ఇక వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కాగా గత సంవత్సరం ప్రభాస్ ఆది పురుష్ మూవీలో సీత పాత్రలో నటించి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో రాముడి పాత్రకు మీసాలు ఉండటం వంటి వివాదాలతో దర్శకుడు ఓం రౌత్ తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే అప్పట్లో ప్రభాస్ - కృతి సనన్ మధ్య రిలేషన్ ఉందనే రూమర్స్ వినిపించాయి. ఓ షోలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ అందుకు ఆజ్యంపోయగా.. అలాంటిదేమీ లేదని, ప్రభాస్, తను ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమేనంటూ రూమర్లను ఖండించింది కృతి సనన్. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ గురించి మరో వార్త వైరల్ అవుతోంది. ఏంటంటే.. కృతి సనన్ తనకంటూ తనకంటే పదేండ్లు చిన్నవాడైన ప్రముఖ వ్యాపార వేత్త కబీర్ బహియాను లైన్‌లో పెట్టింది.

ఓ వైపు కృతి సనన్, కబీర్ బహియా మధ్య చాలా రోజులుగా ఎఫైర్ నడుస్తోందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతుండగా, మరోవైపు వీరిద్దరూ విదేశాల్లో ఎంజాయ్ చేశారని, అందుకు సంబంధించిన ఫొటోలు ఇవేనంటూ కూడా కొందరు ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ కబీర్ ఎవరు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

కాగా 24 ఏండ్ల కబీర్ బహియా లండన్‌కి చెందిన ఓ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి, అతని తండ్రి కుల్విందర్ బహియా యూకేలో ‘సౌథాల్ ట్రావెల్’ ఏజెన్సీని నడుపుతున్నాడు. దీంతోపాటు పలు వ్యాపారాలు ఉండటంతో ప్రస్తుతం కబీర్ ఆస్తుల విలువ రూ. 45 వేలకోట్లకు పైనేనట. ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. ‘అందుకే లైన్‌లో పెట్టింది. కృతి సనన్ ప్లాన్ మామూలుగా లేదుగా..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story