Kriti Sanon: తనకంటే 10 ఏళ్లు చిన్నవాడితో కృతి సనన్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

by Hamsa |   ( Updated:2024-08-13 11:06:44.0  )
Kriti Sanon: తనకంటే 10 ఏళ్లు చిన్నవాడితో కృతి సనన్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు పలు హిందీ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీతో ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొనసాగుతుంది. అలాగే తెలుగులో పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో సీతగా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో కృతి బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి కృతి సనన్ తనకంటే 10 ఏళ్లు చిన్నవాడితో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

కబీర్ బహియాతో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి డేటింగ్ వార్తలపై స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘గత కొద్ది రోజుల నుంచి నా డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అలాంటి తప్పుడు సమాచారాన్ని అందించే ముందు నాతో పాటు నా ఫ్యామిలీ కూడా బాధపడుతుందని తెలుసుకోండి. దాని వల్ల వచ్చే పరిణామాలు అందరూ ఎదుర్కోవాలి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసిన వారంతా నాకు ఫోన్, మెసేజ్ చేస్తున్నారు.

నాకు మాత్రం వాటికి స్పందించాలంటే చిరాకుగా ఉంది. నా కంటే 10 ఏళ్లు చిన్నవాడితో డేటింగ్ అనే వార్త నన్ను ఎక్కువగా బాధపెడుతుంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. ఈ రోజుల్లో రూమర్స్ రాయడం కామన్ అయిపోయింది. ఆన్‌లైన్ వచ్చినప్పటి నుంచి అవతలి వారిపై రూమర్స్ క్రియేట్ చేయడమే కాకుండా నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ కృతి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న వారు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Read More..

Janhvi Kapoor: తల్లి జయంతి సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వెళ్లిన జాన్వీ కపూర్.. స్పెషల్ పోస్ట్ వైరల...

Advertisement

Next Story