విజయాలతోనే అలాంటి వారికి బుద్ధి చెప్పాలనుకున్నా.. కృతి ఎమోషనల్

by Hamsa |   ( Updated:2023-09-05 07:35:12.0  )
విజయాలతోనే అలాంటి వారికి బుద్ధి చెప్పాలనుకున్నా.. కృతి ఎమోషనల్
X

దిశ, సినిమా: స్టార్ నటి కృతి సనన్ కెరీర్ మొదట్లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘మిమీ’ చిత్రానికి ఉత్తమ నటిగా అలియాభట్‌తో కలిసి అవార్డు పంచుకున్న ఆమె రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్‌ తొలినాళ్లలోనే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. మోడలింగ్‌లో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఒక షో రిహార్సల్స్‌ కోసం హైహీల్స్‌ వేసుకొని గడ్డిలో నడిచాను. అయితే అక్కడ నెల సమతలంగా లేకపోవడంతో కుదురుగా నడవలేకపోయా.

అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్‌ నాతో దురుసుగా ప్రవర్తించింది. దాంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. బోరున ఏడ్చాను. ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఈ సంఘటనతో తనలో మరింత ధృడ సంకల్పం పెరిగిందని, ఇండస్ట్రీలో భారీగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించానని చెప్పింది. చివరగా ‘నా విజయాలతోనే అలాంటి వారికి బుద్ధి చెప్పాలనుకున్నా. ఇప్పుడు నా టైమ్‌ వచ్చింది. నాడు విమర్శించిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు. నా దృష్టిలో అదే నిజమైన విజయం. మళ్లీ ఆమెతో కలిసి ఇప్పటివరకూ పనిచేయలేదు’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది.

Advertisement

Next Story