గులాబీ డ్రెస్‌లో అదరహో అనిపిస్తున్న కృతి సనన్.. పిక్స్ వైరల్

by Hamsa |   ( Updated:2024-01-25 12:01:26.0  )
గులాబీ డ్రెస్‌లో అదరహో అనిపిస్తున్న కృతి సనన్.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్ స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. మొదట మోడల్‌గా మెరిసిన ఆమె హీరోపంతితో నటిగా పరిచయం అయింది. తెలుగులో మహేష్ బాబు ‘నేనొక్కడినే’ మూవీతో తెలుగులో అలరించింది. ఈ సినిమా విడుదలై పెద్దగా హిట్ అందుకోకపోవడంలో బాలీవుడ్‌కు చెక్కేసింది. మళ్లీ 2023లో తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ నటించి మెప్పించింది. ఇది కూడా పెద్దగా విజయం అందుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. ప్రస్తుతం ఈ భామ మూడు చిత్రాలతో రాబోతుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా, కృతి సనన్ గులాబీ డ్రెస్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసి కుర్రకారును చెమటలు పట్టిస్తోంది. మత్తెక్కించే చూపులతో అదరహో అనిపిస్తుంది. ఇక ఆ ఫొటోలను చూసిన వారంతా హాట్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story