Krithi Shetty: రెడ్ మిర్చీలా తన అందాలతో ఘాటెక్కిస్తున్న కృతి శెట్టి.. ఫొటోలు వైరల్

by Kavitha |   ( Updated:2024-07-26 15:25:31.0  )
Krithi Shetty: రెడ్ మిర్చీలా తన అందాలతో ఘాటెక్కిస్తున్న కృతి శెట్టి.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ అందుకుంది. దీంతో వరుస ఆఫర్లు వచ్చాయి. అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో, తన అంద చందాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అందం విషయంలో ఫుల్ మార్కులు పడ్డాయి.. కానీ, సినిమాల విషయంలో మాత్రం నిలదొక్కుకోలేదు. అంతేకాకుండా రీసెంట్‌గా వచ్చిన ‘మనమే’ కూడా నిరాశే పరిచింది. ప్రస్తుతం తెలుగులో ఒక్క మూవీ కూడా అనౌన్స్ చేయలేదు. కానీ తమిళంలో మూడు, మలయాళంలో ఒక మూవీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలోనే ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా కృతిశెట్టి ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రెడ్ శారీ ధరించి హాట్‌గా చూస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు ‘రెడ్ మిర్చిలా ఘాటెక్కిస్తున్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఆ పిక్స్ పై ఓ లుక్ వేసేయండి.


(video link credits to krithi shetty instagram id)

Advertisement

Next Story