కృతికి హ్యాండ్ ఇచ్చిన హీరో సూర్య.. పాపం బేబమ్మ ఎంత కష్టం వచ్చింది...

by Sujitha Rachapalli |
కృతికి హ్యాండ్ ఇచ్చిన హీరో సూర్య.. పాపం బేబమ్మ ఎంత కష్టం వచ్చింది...
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ కృతి శెట్టి స్పీడ్ తగ్గింది. కెరీర్ మొదట్లో ఉన్నంత క్రేజ్ మెయింటైన్ చేయలేకపోతుంది. చేస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో కోలుకోలేకపోతుంది. త్వరలో రాబోతున్న ' మనమే ' అయినా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఇది సక్సెస్ అయితేనే కెరీర్ నిలబడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా తెరమీదకు వస్తాయో లేదో అనే డౌట్ వెంటాడుతుంది. ఆల్రెడీ సూర్య హీరోగా వస్తున్న ఓ సినిమాలో కృతి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ హై బడ్జెట్ ఫిల్మ్ లో మెయిన్ లీడ్ గా ఓకే కావడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ప్రస్తుతానికి ఆ మూవీ ఆగిపోయిందని తెలుస్తుంది. దీంతో కృతి మంచి ఛాన్స్ కోల్పోయినట్లు అయిపోయింది.

కాగా కృతి శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయిపోయింది. అవకాశాల కోసం ఫోటోషూట్ చేస్తూ అప్ డేట్ పిక్స్ షేర్ చేస్తుంది. ఈ మధ్య కాస్త చిక్కిపోయిన బేబమ్మ.. నడుము అందాలను చూపించేస్తుంది. కాగా కృతి నటించిన మనమే జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సాంగ్స్ ఆకట్టుకోగా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Next Story