- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara: దేవర సినిమా విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న కొరటాల శివ.. ఇది అసలు ఊహించలేదుగా..!
దిశ, వెబ్ డెస్క్ : కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ దేవర. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల చేస్తున్న ఈ మూవీ పై తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. మరో ఐదు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఎన్ని మార్పులు చేసారో ఇక్కడ చూద్దాం..
వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ దేవర సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్‌బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీరి కాంబోలో వస్తున్న సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సారి ఎలా అయినా దేవరతో హిట్ కొట్టేలనే ప్లాన్ చేస్తున్నాడు. దీంతో విడుదలకు ముందే మార్పులు చేస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. రన్‌టైమ్ విషయంలో కొరటాల శివ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
దేవర మూవీని రెండు గంటల యాభై ఏడు నిమిషాల రన్‌టైమ్‌తో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. ఐతే, ఇటీవల మన ముందుకొచ్చిన మూడు గంటల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు మేకర్స్ తగ్గించినట్లు తెలిసింది. ఇప్పుడు రెండు గంటల నలభై రెండు నిమిషాల ఫైనల్ రన్‌టైమ్‌తో ఆడియెన్స్ కు ముందుకు రానుందని సినీ వర్గాల నుంచి సమాచారం.