- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NIHARIKA:‘ఆ స్టార్ హీరో అంటే పిచ్చి ఇష్టం’ అస్సలు వదులుకోనంటూ మెగా డాటర్ సంచలన కామెంట్స్
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన మొదటి అమ్మాయి అని చెప్పుకోవచ్చు. కానీ నిహారిక నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. అదేంటో తెలియదు కానీ మెగా ఫ్యామిలీకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడుకు అంతగా సపోర్ట్ చేయలేదు. మేబీ సిల్వర్ స్క్రీన్ పై మెగా డాటర్ కనిపించకూడదు.. మెగా కుటుంబంలోని అమ్మాయిలంతా సంప్రదాయంగానే ఉండాలనుకున్నారేమో. అందుకే సినిమాల్లో పెద్దగా రాణించలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు.
ఇక మూడేళ్ల కింద నిహారికను సిద్ధు జొన్నలగడ్డకిచ్చి నాగబాబు అంగరంగ వైభవంగా వివాహం జరిపించిన విషయం తెలిసిందే. కానీ పలు కారణాల వల్ల వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారు. దీంతో మెగా డాటర్స్‌కు పెళ్లిళ్లు కలిసి రావడం లేదంటూ జనాలు నెట్టింట చర్చించుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక తన కెరీర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. ‘కమిటీ కుర్రాళ్లు’ అనే టైటిల్‌తో తెరకెక్కే సినిమాను నిర్మించింది. ఈ చిత్రం ఆగస్టు 9 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది.
అయితే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటోన్న నిహారిక పలు విషయాలు బయటపెడుతూ వస్తోంది. తాజాగా మెగా డాటర్‌కు ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్న ఎదురైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్..?ఈ ముగ్గరిలో ఎవరంటే ఎక్కువగా ఇష్టమని యాంకర్ అడగ్గా.. ఎలాంటి సందేహం లేకుండా నిహారిక వెంటనే పాన్ ఇండియా స్టార్ నేమ్ చెప్పేసింది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమని, రెబల్ స్టార్ కామెడీ అంటే పిచ్చి ఇష్టమని వెల్లడించింది. ఆయన నటించిన సినిమాల్లో డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీస్ ఎంతగానో నచ్చుతుందని.. ప్రభాస్‌తో నటించే అవకాశం మాత్రం వస్తే అస్సలు వదులుకోనని నిహారిక చెప్పుకొచ్చింది.