మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కోలీవుడ్ ప్రేమ‌జంట

by Prasanna |   ( Updated:2023-09-13 07:30:23.0  )
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కోలీవుడ్ ప్రేమ‌జంట
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడ‌య్యాడు. సీనియ‌ర్ న‌టుడు అరుణ్ పాండియ‌న్ కుమార్తె కీర్తి పాండియ‌న్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న అశోక్.. సెప్టెంబ‌ర్ 13న తిరున‌ల్వేలిలో కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో కీర్తికి మూడుముళ్లు వేశాడు. ఈ వేడుకకు సంబంధించిన పెళ్లి ఫొటోల‌ను అశోక్ సెల్వన్ సోషల్ మీడియా వేదికగా అభిమానుల‌తో పంచుకున్నాడు. అయితే ‘తుంబా’ అనే సినిమాతో కీర్తి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వగా ఇదే మూవీలో అశోక్ హీరోగా నటించాడు. ఇలా ఈ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా మొత్తానికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Advertisement

Next Story