రాకేష్-హృతిక్ రోషన్‌లు పెద్ద మోసగాళ్లు.. నమ్మించి నట్టేట ముంచేస్తారు

by Anjali |   ( Updated:2023-06-27 08:48:05.0  )
రాకేష్-హృతిక్ రోషన్‌లు పెద్ద మోసగాళ్లు.. నమ్మించి నట్టేట ముంచేస్తారు
X

దిశ, సినిమా: రాకేష్ రోషన్ తెరకెక్కించిన ‘కోయి మిల్ గయా’లో తనకు జరిగిన అన్యాయంపై రజత్ బేడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2003లో హృతిక్ రోషన్, ప్రీతి జంటా జోడిగా వచ్చిన ఈ మూవీలో ఓ కీ రోల్ పోషించిన రజత్.. ఈ మూవీ బిగ్ హిట్ అయినప్పటికీ తనకు ఏ రకంగా లాభం చేకూర్చలేదని వాపోయాడు. ‘ఈ మూవీ హిట్ అయినా నాకేమీ మేలు జరగలేదు. సినిమాలో ప్రీతి, హృతిక్ రోషన్‌లతో కలిసి చాలా సన్నివేశాల్లో నటించాను. కానీ, ఫైనల్ కట్ తర్వాత చాలా ఎడిట్ చేయబడ్డాయి. అంతటితో ఆగకుండా మేకర్స్ సినిమా ప్రమోషన్స్ నుంచి నన్ను పూర్తిగా తప్పించడంతో చాలా నిరుత్సాహానికి గురయ్యాను’ అని తెలిపాడు. చివరగా ఈ ఊహించని అవమానం కొంతకాలంగా తనను మానసికంగా దెబ్బతీసినప్పటికీ మళ్లీ బలంగా నిలబడ్డానని చెప్పాడు.

Advertisement

Next Story