- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీడియాకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చిన కోహ్లీ దంపతులు..
దిశ, సినిమా: టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. వీరికి వామిక, అకాయ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఫొటోలు ఇప్పటిదాకా బయటకు రాలేదు. కాగా మీడియాకు చెందిన కొందరు ఫొటోగ్రాఫర్లకు కోహ్లీ దంపతులు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కోహ్లీకి మీడియా వాళ్లతో మంచి సంబంధాలే ఉన్నాయి. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు కూల్‌గా ఆన్సర్స్ ఇచ్చేవాడు. ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు కూడా విసుక్కోకుండా నవ్వుతూ సమాధానాలు ఇచ్చేవాడు. అయితే విరుష్క దంపతులు తమ పిల్లలు వామిక, అకాయ్‌ను ఎయిర్పోర్ట్ లేదా ఇతరపబ్లిక్ ప్లేసెస్‌కు తీసుకొచ్చినప్పుడు ఫోటోలు, వీడియోలు తీయకుండా కేర్ తీసుకునేవారు.
వాళ్లకు ప్రైవసీ ఇవ్వాలంటూ ఫోటోగ్రాఫర్స్‌ని కోరేవారు. వాళ్లు సహకరించడంతో ఫోటోలు బయటకు రాలేదు. ప్రైవసీకి భంగం కలిగించనందుకు గానూ ఫొటోగ్రాఫర్లకు బహుమతులుగా స్మార్ట్ వాచ్‌లు, స్వీట్స్, ఇతర టెక్నికల్ గాడ్జెట్స్‌ను కలిపి బాక్స్‌లో పెట్టి గిఫ్ట్‌లు అందించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Virat Kohli and Anushka Sharma's gratitude to paparazzi for respecting their kid's privacy with heartfelt gifts. ❤️ pic.twitter.com/7VnFmRaFHz
— Tanuj Singh (@ImTanujSingh) May 14, 2024