- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగుబోతుల లైఫ్ స్టైల్ తెలుసుకున్నా: టాలీవుడ్ హీరో
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం ఈనెల (అక్టోబరు) 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కలర్స్ స్వాతి కథానాయికగా నటించింది. తాజాగా నవీన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలను వెల్లడించారు. ‘డైరెక్టర్ ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఏమి మాట్లాడకుండా ఓకే చెప్పేశాను. నిజానికి నేను అప్పటికే చాలా బిజీగా ఉన్నాను. కానీ ఇందులోని నా పాత్ర బాగా నచ్చింది. నాచురల్‌గా అనిపించింది. ఈ మూవీలో నేను తాగుబోతుగా కనిపిస్తాను. దానికోసం అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నవాళ్లను దగ్గరగా చూశాను. ఆ బాడీ లాంగ్వేజ్ కోసం ఎంతగానో కష్టపడ్డాను. ఇందులో నా పేరు మధుసూదనరావు. ఇందులో స్వాతి.. నా మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాయన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మాతో పనిచేసిన అందరికి మంచి పేరు తెచ్చి పెట్టే చిత్రం ఇది.’’ అంటూ నవీన్ చంద్ర వెల్లడించారు.
- Tags
- Naveen Chandra