జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసిన బేబమ్మ

by Aamani |   ( Updated:2023-05-07 14:25:37.0  )
జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసిన బేబమ్మ
X

దిశ, సినిమా : ‘కస్టడీ’ కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశానని చెప్తోంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటనకు స్కోప్ ఉందని, తన పాత్ర పరిధి కూడా ఎక్కువేనని తెలిపింది. ఇక సాధారణంగా సినిమాల్లో హీరో.. విలన్‌ను అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఈ చిత్రంలో కాపాడటానికి ట్రై చేస్తాడని, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుందని వివరించింది. నాగచైతన్యతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందని.. చైతు ఫేవరేట్ నటుడే కాదు వ్యక్తి కూడా అని తెలిపింది. కాగా డైరెక్టర్ వెంకట్ ప్రభు చాలా స్వీట్ పర్సన్ అని, ఫ్రెండ్లీగా ఉంటారన్న కృతి.. ‘జయాపజయాలు ప్రయాణంలో భాగమే. ఫెయిల్యూర్‌ను విశ్లేషించుకుని రిపీట్ కాకుండా ముందుకు సాగాల్సిందే’ అని అభిప్రాయపడింది.

Also Read..

ముఖంపై గాయాలతో కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న వీడియో…

Advertisement

Next Story