- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రేపటి నుంచే మొదలు.. కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చిన యంగ్ హీరో
దిశ, సినిమా: గతేడాది ‘మీటర్, రూల్స్ రంజన్’ మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ప్రజెంట్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గోపాలకృష్ణ నిర్మిస్తున్నాడు.
ఏకంగా రూ. 20 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం కానుందని తెలుస్తుండగా.. పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మూవీ యూనిట్. అయితే.. ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో నిజంగానే భారీ బడ్జెట్‌తో కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నాడా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా ఈ హీరో పెట్టిన పోస్ట్‌తో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ‘రేపు స్టార్ట్ చేద్దాం’ అంటూ తన X ఖాతా ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ప్రజెంట్ ఇది నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ భారీ ప్రాజెక్ట్ గురించే అనౌన్స్మెంట్ అయుంటుంది అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.