కనురెప్ప వాల్చకుండా చూశా : 'గంగూబాయి కతియావాడి'పై Kiara Advani

by sudharani |   ( Updated:2022-12-15 07:19:44.0  )
కనురెప్ప వాల్చకుండా చూశా : గంగూబాయి కతియావాడిపై Kiara Advani
X

దిశ, సినిమా : అలియా భట్ నటించిన 'గంగూబాయి కతియావాడి' సినిమాపై సహనటి కియారా అద్వానీ ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి తనలో ఎగ్జయిట్‌మెంట్ పెరిగిందని, విడుదలకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశానని తెలిపింది. అలాగే ఈ మూవీ చూస్తున్నప్పుడు తాను తెరపైకి రాకుండా ఉండలేకపోయానని చెప్పింది. అంతేకాదు సంజయ్ లీలా బన్సాలీ సినిమాలో భాగం కావాలనే కోరికను వ్యక్తం చేసింది.

తాజా ఇంటరాక్షన్‌లో భాగంగా 2022లో నచ్చిన సినిమా చెప్పాలని ప్రశ్నించగా.. ''గంగూబాయి కతియావాడి' సినిమా చూస్తున్నప్పుడు రెప్పవాల్చలేకపోయాను. సినిమాలో అలియా అద్భుతంగా ఉంది. సంజయ్ సర్ ఆర్టిస్టుల నుంచి టాలెంట్ బయటకు తీసుకొచ్చే విధానం గొప్పగా ఉంటుంది. నేనూ అందులో ఉంటే బాగుండేదని భావిస్తున్నా' అని వివరించింది. ఇదిలావుండగా.. కియారా సెప్టెంబర్‌లో సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయంలో కనిపించడంతో తదుపరి చిత్రం కూడా ఆయనతోనే చేయబోతున్నట్లు పుకార్లు వచ్చాయి.

Also Read...

Eesha Rebba: బిగువైన అందాల‌తో మొత్తం కనిపించేలా కేక పెట్టిస్తోన్న ఈషా రెబ్బా

Advertisement

Next Story