ఎనిమిది నెలల్లోనే అసలు రంగు బయటపెట్టిన హీరోయిన్..

by Prasanna |   ( Updated:2023-08-11 10:22:41.0  )
ఎనిమిది నెలల్లోనే అసలు రంగు బయటపెట్టిన హీరోయిన్..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ కియారా అద్వానీ ‘ది బ్రాండ్ ఎండోర్సర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్న ఆనందంలో మునిగిపోయింది. ఈ ఘనత సాధించేందుకు హెల్ప్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పిన బ్యూటీ.. ఎనిమిది నెలల వయసులోనే ఫస్ట్ యాడ్ చేశానని తెలిపింది. ఆ తర్వాత మోడల్‌గా ఎదగడం.. హీరోయిన్‌గా రాణించడం.. ఇప్పుడు టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం అనేది లైఫ్ ఫుల్ సర్కిల్‌ మాదిరిగా అనిపిస్తుందని తెలిపింది. తనను రికగ్నైజ్ చేసినందుకు ఇంటర్నేషనల్ అడ్వర్‌టైజింగ్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక రీసెంట్‌గా ‘సత్య ప్రేమ్ కీ కథ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కియారా.. ప్రజెంట్ పలు బాలీవుడ్ ప్రాజెక్ట్‌‌లతో పాటు ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉంది.

Read More: ఇష్టపూర్వకంగా కమిట్ మెంట్ ఇచ్చాక.. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడొద్దు: నిహారిక

Advertisement

Next Story