Khushi Kapoor: హార్ట్ సింబల్‌తో ఖుషీ కపూర్ పోస్ట్.. ఆ నటుడితో లవ్ కన్ఫామ్ అంటూ నెట్టింట చర్చ!

by Hamsa |
Khushi Kapoor: హార్ట్ సింబల్‌తో ఖుషీ కపూర్ పోస్ట్.. ఆ నటుడితో లవ్ కన్ఫామ్ అంటూ నెట్టింట చర్చ!
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ ‘ది ఆర్చీస్’ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. చేసింది ఒక సినిమా అయినప్పటికీ అమ్మడు ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి యంగ్ నటుడు వేదాంగ్ రైనాతో రిలేషన్‌లో ఉన్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ది ఆర్చీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు ప్రచారం మొదలైంది. కానీ దీనిపై వీరిద్దరూ స్పందించకపోవడంతో నిత్యం వీరి రిలేషన్ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఖుషి కపూర్, వేదాంగ్ రైనా నటించిన జిగ్రా మూవీ ట్రైలర్‌పై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అయింది. ట్రైలర్ షేర్ చేస్తూ హార్ట్ సింబల్, ఎమోషనల్ ఫేస్ ఉన్న ఎమోజీ షేర్ చేసింది. ప్రజెంట్ ఈ అమ్మడు పోస్ట్ నెటిజన్ల చర్చకు దారితీసింది. ఖుషి కపూర్, వేదాంగ్ లవ్ చేసుకుంటున్నారంటూ అందుకే హార్ట్ సింబల్ పెట్టిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని కొంతమంది వాదిస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ మొత్తానికి ఖుషి కపూర్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story