మీరు బ్లూ ఫిలిమ్స్ చూస్తారు అందుకే ఇలా? ఖుష్బూ సంచలన కామెంట్స్

by Anjali |   ( Updated:2023-10-14 10:46:06.0  )
మీరు బ్లూ ఫిలిమ్స్ చూస్తారు అందుకే ఇలా? ఖుష్బూ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన ఆరోపణలపై మాట్లాడారు. మహిళ నాయకురాలిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదంటూ ఇప్పటికి ఎంతో మంది రోజా స్నేహితులు మండిపడుతూ వాటిని ఖండించారు. ఇకపోతే నటి కుష్బూ కూడా సత్యనారాయణపై మండిపడుతూ వ్యాఖ్యలు చేసింది. తాజాగా మళ్లీ ఖుష్బూ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘బ్లూ ఫిలిమ్స్ మీ దగ్గర ఉండి ఉంటే.. మీరు బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నారు అన్నట్లే కదా? చూస్తున్నారు కాబట్టే.. ఆమె బ్లూ ఫిలిమ్స్‌లో నటించిందని మీకు తెలుసు. ఇలా ఎవరు మాట్లాడటం లేదే. అవును నేను బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నాను.

అందుకే రోజాను అందులో చూశానని.. బండారు సత్యనారాయణను చెప్పమని చెప్పండి చూద్దాం. దీన్ని బట్టి అందరికి స్పష్టంగా అర్థమయిపోతుంది. మీరు బ్లూ ఫిలిమ్స్ చూస్తారు. పోర్న్ చూస్తారు. కానీ ఒక మహిళ గురించి దిగజారి ఎలా మాట్లాడుతారు? నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక పురుషుడిగా మీలోని భయాలను ఓటమిని చూపిస్తుంది. మగాడిగా మాత్రమే కాదు.. మనిషిగా కూడా మీరు ఓడిపోయారు. దీన్ని నేను కచ్చితంగా ఖండిస్తున్నాను.’’ అంటూ సత్యనారాయణపై మండిపడుతూ ఖుష్బూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story