రామ్ మందిర్ నిర్మాణానికి యశ్ రూ.50 కోట్ల విరాళం?

by sudharani |   ( Updated:2023-03-24 17:50:32.0  )
రామ్ మందిర్ నిర్మాణానికి యశ్ రూ.50 కోట్ల విరాళం?
X

దిశ, సినిమా : 'కేజీఎఫ్' స్టార్ యశ్ అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి రూ. 50 కోట్లు విరాళంగా ఇచ్చాడన్న న్యూస్ వైరల్ అవుతోంది. కాగా దీనిపై రాఖీ భాయ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోగా.. ఇది నిజమేనా అనే అనుమానం చాలా మంది నెటిజన్లలో కలిగింది. దీంతో ఓ మీడియా చానల్ ఈ విషయంపై రీసెర్చ్ చేయగా.. ఓ అభిమాని ఎకౌంట్ ద్వారా ఈ న్యూస్ స్ప్రెడ్ అయినట్లు తెలిసింది. ఇందులో ఉన్న యశ్ ఫొటో.. ఏప్రిల్ 2022 తిరుపతి దర్శనానికి సంబంధించినదని, ఆయన అయోధ్యకు ఎలాంటి కానుకలు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. కాగా యశ్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న 'సలార్' చిత్రంలో గెస్ట్ రోల్ చేయబోతున్నారు.

HHVM మూవీ అప్‌డేట్.. మరింత స్పెషల్‌గా పవర్ స్టార్ బర్త్ డే

Advertisement

Next Story