KGF-2 star Yash : డబ్బుకు విలువనిస్తా.. సినిమా అందుకే ఆలస్యం అవుతోంది.

by sudharani |   ( Updated:2023-06-21 15:48:17.0  )
KGF-2 star Yash : డబ్బుకు విలువనిస్తా.. సినిమా అందుకే ఆలస్యం అవుతోంది.
X

దిశ, సినిమా : ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించడం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘కేజీఎఫ్ 2’ విడుదలై ఏడాది పూర్తి అయిన.. ఇంకా సినిమా అనౌన్స్ చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపాడు. ‘ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుతో సినిమా చూస్తారు. ఆ మనీకి నేను విలువ ఇస్తాను. అందుకే శ్రద్ధగా, అంకితభావంతో పనిచేస్తున్నాం. ప్రపంచం మొత్తం సినిమా చూస్తోంది. మరింత బాధ్యతగా ఉండాలని నాకు తెలుసు. చాలా కాలం పాటు కష్టపడి చేసే పని అందరినీ సంతోషపరుస్తుంది. త్వరలో జరుగుతుంది. నేను ఇప్పటికే చెప్పినట్లు.. వారిని సంతోషపెట్టడం నా బాధ్యత. నేను ప్రయత్నిస్తాను. నెరవేరుస్తాను’ అని చెప్పుకొచ్చాడు. ‘బాలీవుడ్ సినిమా ఓకే చేశారా?’ అన్న ప్రశ్నకు త్వరలోనే తెలుస్తుందన్నాడు యశ్.

ఇవి కూడా చదవండి:

నాకంటే ప్రభాస్, మహేశ్ బాబు చాలా పెద్ద హీరోలు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story